గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన శ్రేయస్..గ్లెన్ ఫిలిప్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

by velandi.Saikiran |   (  Updated:2026-04-16 18:11:29  IST  )

ముంబై, పంజాబ్ మ్యాచ్ సంద‌ర్భంగా క్యాచ్ పట్టిన శ్రేయస్ వీడియో వైర‌ల్ గా మారింది.

గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన శ్రేయస్..గ్లెన్ ఫిలిప్స్ కూడా కుళ్లుకోవాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ లోనూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. గత సీజన్ లో ఫైనల్ దాకా పంజాబ్ కింగ్స్ ను తీసుకువెళ్లిన శ్రేయస్, ఇప్పుడు కూడా పట్టు వదలడం లేదు. బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలో అదరగొడుతున్న శ్రేయస్, తాజాగా అదిరిపోయే క్యాచ్ పట్టాడు. వాంఖ‌డే వేదిక‌గా ముంబై, పంజాబ్ మ్యాచ్ జ‌రిగింది. ఇందులో ముంబై మొద‌ట‌ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 18వ ఓవర్ మార్కో యాన్సెన్ బౌలింగ్ చేశాడు.

క్యాచ్ ఆఫ్ ది టోర్న‌మెంట్ కావ‌డం ప‌క్కా

ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్యా, మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న శ్రేయస్, చాక చక్యంగా బంతిని అందుకొని లోపలికి విసిరేశాడు. ఇక ఆ బంతిని జేవియర్ బార్ట్‌లెట్ ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా 14 పరుగుల వద్దకు పెవిలియన్ కు వెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ క్యాచ్ చూస్తే గ్లెన్ ఫిలిప్స్ కూడా కుళ్లుకుంటాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ముంబై పై పంజాబ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Next Story