- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో పచ్చిబూతులు.. స్పందించిన శ్రేయస్ అయ్యర్ సోదరి
సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై తాజాగా అయ్యర్ సోదరి శ్రేష్ట షాకింగ్ వీడియో పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్స్ ఇంటిదారి పట్టిన నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్టను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య ఓ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీనివల్ల రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇలాంటి క్రమంలో మా దయ వల్ల కేకేఆర్ కు సింగిల్ పాయింట్ దక్కిందని డాన్స్ చేస్తూ ట్రోల్ చేశారు శ్రేష్ట అయ్యర్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ పతనం మొదలైంది. ఫలితంగా టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే శ్రేష్ట అయ్యర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
దయచేసి వాళ్లను లాగకండి - శ్రేష్ట అయ్యర్
సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై తాజాగా అయ్యర్ సోదరి శ్రేష్ట షాకింగ్ వీడియో పెట్టారు. కేకేఆర్ మ్యాచ్ తర్వాత సరదా కోసం ఈ వీడియో చేశానని వివరించే ప్రయత్నం చేశారు. ఆ జట్టును, ఆటగాళ్లను అవమానించాలని తాను చేయలేదన్నారు. ఈ క్రమంలోనే కొందరు తనతో పాటు పర్సనల్, ప్రొఫెషనల్ గా సంబంధం ఉన్న వాళ్లను కూడా టార్గెట్ చేస్తున్నారు... ఫోన్లు చేసి బండ బూతులు తిడుతున్నారని ఎమోషనల్ అయ్యారు శ్రేష్ట అయ్యర్. అయితే ఈ వివాదంలోకి ఇతరులను లాగకండి అని కోరారు. పని లేని వాళ్లే ఇలా ట్రోల్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వీడియో పెట్టారు శ్రేష్ట అయ్యర్.






