ధోనికి సాధ్యం కాలేదు...కానీ 18 ఏళ్ల త‌ర్వాత సంజు చేసి చూపించాడు

by velandi.Saikiran |

శనివారం ఢిల్లీపై మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 56 బంతుల్లో 115 పరుగులు చేసి దుమ్ము లేపాడు సంజు.

ధోనికి సాధ్యం కాలేదు...కానీ 18 ఏళ్ల త‌ర్వాత సంజు చేసి చూపించాడు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ( Sanju Samson) ఫామ్ లోకి వచ్చాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో విఫలమైన సంజు, శనివారం ఢిల్లీపై మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 56 బంతుల్లో 115 పరుగులు చేసి దుమ్ము లేపాడు. 205 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు సంజు. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంజు, అటు మహేంద్ర సింగ్ ధోనీ వల్ల సాధ్యం కాని హిస్టరీని కూడా క్రియేట్ చేశాడు.

ధోనికి అవ‌మానం..ఆ రికార్డు క్రియేట్ చేసిన సంజు

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ గా కొనసాగిన ధోని, ఎప్పుడు కూడా సెంచరీ చేయలేదు. ఏడో స్థానంలో ధోని వస్తాడు కాబట్టి, సెంచరీ సాధ్యపడలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజు, తన తొలి సీజన్ లోనే ధోని వల్ల కానీ రికార్డును క్రియేట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ గా సంజు చరిత్ర సృష్టించాడు. కాగా, 2017, 2019, 2021 ఐపీఎల్ సీజ‌న్స్ ల‌లో కూడా తొలి సెంచ‌రీ న‌మోదు చేసిన సంజు, ఈ సీజ‌న్ లో కూడా అదే రికార్డు సృష్టించాడు.

Next Story