- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంజుతో గొడవ...క్లాసెన్ పై బీసీసీఐ యాక్షన్ !
చెన్నై, హైదరాబాద్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా సంజు శాంసన్, క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: చెన్నై, హైదరాబాద్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా సంజు శాంసన్, క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అర్థ సెంచరీకి దగ్గరగా వచ్చిన కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ను స్టంప్ ఔట్ ఊహించని షాక్ ఇచ్చాడు సంజు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన క్లాసెన్, సంజును దూషించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీడియో కూడా వైరల్ గా మారింది. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఏకమై.. క్లాసెన్ ను టార్గెట్ చేస్తున్నారు. సంజు శాంసన్ ను ఎవరైనా టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.
నీ కోపం తగ్గించుకో అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సంఘటనపై బీసీసీఐ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా క్లాసెన్ పై వేటు వేసే ప్రమాదం ఉందని అంటున్నారు. భారీ స్థాయిలో ఫైన్ వేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. కచ్చితంగా గెలవాల్సిన నిన్నటి మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా.. హైదరాబాద్ విజయం సాధించింది. ఈ క్రమంలో SRH ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది.






