చెన్నైకి బిగ్ షాక్‌..సంజుకు తీవ్ర‌ గాయం !

by velandi.Saikiran |

చెన్నైకి బిగ్ షాక్‌..సంజు శాంస‌న్ కు తీవ్ర‌ గాయం అయింది.

చెన్నైకి బిగ్ షాక్‌..సంజుకు తీవ్ర‌ గాయం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో డేంజర్ ఆటగాడు సంజు శాంసన్ కు తీవ్ర గాయమైంది. వికెట్ కీపింగ్ చేస్తుండగా అతని ఎడమ చేతి చిటికెన వేలుకు బంతి బలంగా తగిలింది. ఈ క్రమంలో నొప్పితో విలవిలలాడిపోయాడు వికెట్ కీపర్ సంజు శాంసన్. దీంతో ఫిజియో వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసినప్పటికీ, సంజు శాంసన్ కోలుకోలేకపోయాడు.

చేసేది ఏమీ లేక‌ మైదానాన్ని వీడి, డగౌట్ కు వెళ్లిపోయాడు. సంజు వెళ్లిపోయిన నేపథ్యంలో ఉర్విల్ పటేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అయితే ఉర్విల్ పటేల్ వికెట్ కీపింగ్ చేస్తున్న క్రమంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కు మంచి లైఫ్ వచ్చింది. కీపర్ క్యాచ్ అయినప్పటికీ ఉర్విల్ పటేల్ కాన్ఫిడెంట్ గా అప్పీల్ చేయలేకపోయాడు. అప్పటికే రివ్యూ తీసుకునే సమయం అయిపోయిన నేపథ్యంలో గిల్ బతికి బయటపడ్డాడు. అదే సంజు ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేది. కాగా చెన్నై బ్యాటింగ్ స‌మ‌యంలోనైనా సంజు బ‌రిలోకి దిగాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Next Story