- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటమి బాధలో SRH... గొప్ప మనసు చాటుకున్న ఇషాన్ కిషన్
ఓటమి బాధలో SRH ఉండగా ఇషాన్ కిషన్ గొప్ప మనసు చాటుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో SRHకు ఊహించని షాక్ తగిలింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. వైభవ్ సూర్యవంశీ లాంటి బుడ్డోడి దెబ్బకు ఇంటిదారి పట్టింది. దీంతో నిన్నటి వరకు హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ గొప్ప మనసు చాటుకున్నాడు.
హైదరాబాద్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ కు ఏకంగా ఆరు జతల షూలు గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇషాన్ ఇచ్చిన ఒక్కో షూ జత విలువ రూ.20వేల వరకు ఉంటుందని సమాచారం. గతంలో షూలు కొనుగోలు చేసేందుకు కూడా సాకిబ్ హుస్సేన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. తన తల్లి బంగారం తాకట్టు పెట్టి మరీ, షూలు కొనుగోలు చేశారట. ఈ విషయం తెలుసుకున్న ఇషాన్, వెంటనే సాకిబ్ హుస్సేన్ కు సాయం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సాకిబ్ హుస్సేనే వెల్లడించారు.






