ఐపీఎల్ లో ఈ మూడు రూల్స్ మార్చండి - స‌చిన్

by velandi.Saikiran |   (  Updated:2026-05-31 12:32:38  IST  )

ఐపీఎల్ 2026 ముగుస్తున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కీలక సూచనలు చేశారు.

ఐపీఎల్ లో ఈ మూడు రూల్స్ మార్చండి - స‌చిన్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగుస్తున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కీలక సూచనలు చేశారు. ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారాలంటే మూడు రూల్స్ మార్చాలని ఆయన వెల్లడించారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ... ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పూర్తిగా తొలగించాల్సిందేనని కీలక సూచనలు చేశారు. ప్రతి మ్యాచ్ లో ఒక్క బౌలర్ 5 ఓవర్లు వేసేలా రూల్స్ మార్చాలని పేర్కొన్నారు. మిగిలిన బౌల‌ర్లు ఎప్ప‌టిలాగే నాలుగు ఓవ‌ర్లు వేయాల‌న్నారు.

ఇప్పటి వరకు ఆరు ఓవర్లు బ్యాటర్లకు అనుకూలంగా పవర్ ప్లే ఉందన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేయాలని కోరారు సచిన్. మొదటి నాలుగు ఓవర్లు బ్యాటింగ్ పవర్ ప్లేగా కొనసాగించాలని సూచనలు చేశారు. మిగిలిన రెండు ఓవర్లు బౌలర్లకు అనుకూలంగా మలచాలని స్పష్టం చేశారు. బౌలింగ్ ప‌వ‌ర్ ప్లేలో ఒక ఫీల్డ‌ర్ ను 30 యాడ్స్ బయట పెట్టుకునేలా అవకాశం క‌ల్పించాల‌న్నారు. ఈ మూడు రూల్స్ వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తే, ఐపీఎల్ కు మరింత ఆదరణ పెరుగుతుందని వెల్లడించారు.

Next Story