ఇంకాస్త కష్టపడి ఉంటే గెలిచే వాళ్ళం : రియాన్ పరాగ్

by Muthe.Rajitha |   (  Updated:2026-05-30 04:37:32  IST  )

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో GT చేతిలో ఓటమి పాలైన అనంతరం RR కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇంకాస్త కష్టపడి ఉంటే గెలిచే వాళ్ళం : రియాన్ పరాగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైన అనంతరం రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెషన్‌లో పాల్గొన్న పరాగ్.. తమ జట్టు పోరాటాన్ని అభినందిస్తూనే, ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై ఉంచిన 215 పరుగుల స్కోరు మంచిదే అయినప్పటికీ, సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి ముల్లాన్‌పుర్ పిచ్ బ్యాటింగుకు మరింత అనుకూలంగా మారిందని పరాగ్ తెలిపాడు. తమ జట్టు కనుక 230 పరుగుల మార్కును అందుకొని ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ క్రీజులో నిలదొక్కుకుని భారీ భాగస్వామ్యం నెలకొల్పడమే తమ ఓటమిని శాసించిందని కెప్టెన్ ఒప్పుకున్నాడు. తమ జట్టులో ఎక్కువ మంది అనుభవం లేని యువ ఆటగాళ్లే (Youngsters) ఉన్నారని, అయినప్పటికీ వారంతా అద్భుతంగా రాణించి ఈ సీజన్‌లో క్వాలిఫయర్-2 వరకు జట్టును తీసుకురావడం చూస్తే ఎంతో గర్వంగా ఉందని పరాగ్ కొనియాడాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో తన అసాధారణ హిట్టింగ్‌తో సరికొత్త సంచలనం సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని పరాగ్ ప్రత్యేకంగా అభినందించాడు. సూర్యవంశీ భవిష్యత్తులో టీం ఇండియా తరఫున ఆడి దేశానికి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

IPL : సాయి సుదర్శన్ మళ్ళీ హిట్ వికెట్

Next Story