రుతురాజ్ గైక్వాడ్ చెత్త రికార్డు..లోయెస్ట్ స్ట్రైక్ రేట్ ప్లేయ‌ర్ గా!

by velandi.Saikiran |

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

రుతురాజ్ గైక్వాడ్ చెత్త రికార్డు..లోయెస్ట్ స్ట్రైక్ రేట్ ప్లేయ‌ర్ గా!
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. లోయెస్ట్ స్ట్రైక్ రేట్ నమోదు చేసుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ 2026లో పవర్ ప్లే సందర్భంగా కనీసం 100 బాల్స్ ఆడిన బ్యాటర్ల‌లో అతి తక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్ గా చెన్నై కెప్టెన్ రుతురాజ్ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

అతని స్ట్రైక్ రేట్ కేవలం 124.6 గా ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ తర్వాత కేకేఆర్ బ్యాటర్లు రఘువంషి (126.5), కెప్టెన్ రహానే (127) స్ట్రైక్ రేట్లతో వరుసగా ఉన్నారు. అనంతరం గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 144.4 స్ట్రైక్ రేటు సాధించాడు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ లో ఓవరాల్ గా అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్ గా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కొనసాగుతున్నాడు. అతని స్ట్రైక్ రేట్ 234.78 గా ఉంది.


Next Story