ఆ రూల్‌ను మళ్లీ ఉల్లంఘించిన సీఎస్కే.. ఈ సారి జట్టు మొత్తానికి జరిమానా

by Harish |

ఆ రూల్‌ను మళ్లీ ఉల్లంఘించిన సీఎస్కే.. ఈ సారి జట్టు మొత్తానికి జరిమానా
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026 నుంచి చెన్నయ్ సూపర్ కింగ్స్ నిష్ర్కమించిన విషయం తెలిసిందే. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కని బాధలో ఉన్న సీఎస్కేకు జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరో షాకిచ్చింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా చైన్నయ్ తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినందుకు జట్టు మొత్తానికి జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటం ఇది రెండోసారి. మొదటిసారి కేవలం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఫైన్ పడింది. రెండోసారి కూడా రూల్ అతిక్రమించడంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంపాక్ట్ ప్లేయర్ సహా టీమ్ మొత్తంపై చర్యలు తీసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.24 లక్షల ఫైన్ వేసింది. అలాగే, తుది జట్టులోని ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయర్లందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఏది తక్కువైతే అది) జరిమానా విధించినట్టు ఐపీఎల్ తెలిపింది.


Next Story