మ‌రో కొత్త అమ్మాయితో శుభ‌మాన్ గిల్ డేటింగ్..!

by velandi.Saikiran |

శుభ్‌మన్ గిల్, సుప్రియా భట్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

మ‌రో కొత్త అమ్మాయితో శుభ‌మాన్ గిల్ డేటింగ్..!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో ఫుల్ బిజీగా ఉన్నాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్. ఈ టోర్నమెంట్ కంటే ముందు పెద్దగా ఫామ్ లో లేని గిల్... ఇప్పుడు అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టు బాధ్యతలను భుజాన వేసుకొని, ప్లే ఆఫ్స్ దాకా తీసుకువచ్చాడు. ఇక ఇవాళ బెంగళూరు, గుజరాత్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కూడా జరగనుంది. ఇలాంటి క్రమంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

సుప్రియ భట్ అనే అమ్మాయితో గిల్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఇద్దరు సీక్రెట్ గా దాదాపు ఆరు నెలలుగా డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్న లీగ్ దశలో చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ ఆడింది. ఈ మ్యాచ్ మోడీ స్టేడియం వేదికగా జరగగా.. అక్కడికి సుప్రియ భ‌ట్ వచ్చారట.

ఈ సందర్భంగా సీక్రెట్ గా గిల్ ను కూడా ఆమె మీట్ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య జరిగే మ్యాచ్ కు కూడా హాజరు కాబోతున్నారట సుప్రియ. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇంతలోనే సుప్రియ మ్యాటర్ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. క్లిక్

Next Story