IPL 2026 : రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో భాగంగా నేడు RR, LSG మధ్య జరిగిన పోరులో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ మరో సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది.

IPL 2026 : రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ మరోసారి అదరగొట్టింది. IPL 2026 సీజన్లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్(RR), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య జరిగిన పోరులో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ మరో సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. అయితే తొలుత బ్యాటింగుకు దిగిన రాజస్థాన్ బ్యాటర్స్ లో టాపార్డర్ చేతులెత్తేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. జడేజా(43) పరుగులతో స్కోర్ కాస్త పెంచాడు. మిగతా బ్యాటర్స్ ఎవరూ రాణించలేకయారు. అయితే బ్యాటింగ్ విఫలం అయినప్పటికీ బౌలింగులో RR సత్తా చాటింది.

160 పరుగుల లక్ష్యంతో బాడీలోకి దిగిన లక్నో 18 ఓవర్లకే 119 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. మార్ష్ ఒక్కడే 55 పరుగులు చేసి జట్టును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. ఓటమి పాలుకాక తప్పలేదు. ఇక రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడమే కాకుండా సమయానికి కీలక వికెట్లు తీసి, లక్నోను కోలుకొని దెబ్బ తీశారు. ఆర్చర్ 3 వికెట్లు తీయగా, బర్గర్ 2, బ్రిజేష్ 2, జడేజా, బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీశారు. కాగా ఈ విజయంతో రాజస్థాన్ టాప్ 2 లోకి దూసుకుపోగా.. లక్నో 9వ స్థానానికి పడిపోయింది.

Next Story