- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 ఓవర్ల మ్యాచ్...టాస్ గెలిచిన ముంబై
వర్షం కారణంగా రద్దు అవుతుందనుకున్న ముంబై, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఎట్టకేలకు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. వర్షం కారణంగా రద్దు అవుతుందనుకున్న ముంబై, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఎట్టకేలకు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం తగ్గిన నేపథ్యంలో కాసేపటికి క్రితమే టాస్ కూడా వేశారు. ఇందులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ రాజస్థాన్ చేస్తుంది. వర్షం పడ్డ నేపథ్యంలో ముంబై, తెలివిగా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
11 ఓవర్ల మ్యాచ్
గువాహటిలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. రాత్రి దాదాపు 9:30 గంటల వరకు పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. అయితే చివరి క్షణంలో వర్షం తగ్గడం కారణంగా 11 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అంటే రెండు జట్లు కూడా చెరో 11 ఓవర్లు ఆడతాయి. 3.2 ఓవర్ల వరకు పవర్ ప్లే ఉంటుంది. ఒకే ఒక్క బౌలర్ 3 ఓవర్లు వేయవచ్చు. మరో నలుగురు బౌలర్లు తలో రెండు ఓవర్ల చొప్పున వేయవచ్చు.






