- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్..ముంబై-రాజస్థాన్ మ్యాచ్ కు అంతరాయం
ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్..ముంబై-రాజస్థాన్ మ్యాచ్ కు వర్షం అంతరాయం ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఇవాళ రాత్రి జరగాల్సిన ముంబై, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం కనిపిస్తోంది. అస్సాం గువాహటి వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఏడున్నర గంటలకు మ్యాచ్ ఉండగా, ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో వర్షం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
అటు ఇప్పటికే నగరానికి స్థానిక వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ నిన్నటి లాగే రద్దయ్యే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. కేవలం 3 ఓవర్లు మాత్రమే నిన్న జరిగింది. ఆ తర్వాత ప్రారంభమైన వర్షం, ఏ మాత్రం తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఇవాళ ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో టికెట్లు బుక్ చేసుకొని స్టేడియానికి వచ్చిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






