వైభ‌వ్ కు రిలీఫ్‌..రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ‌ర్ కు బీసీసీఐ షాక్‌

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 11:42:45  IST  )

వైభ‌వ్ కు రిలీఫ్ ఇచ్చిన బీసీసీఐ, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ‌ర్ రోమీ భిందర్ పై ఫైన్ వేసింది.

వైభ‌వ్ కు రిలీఫ్‌..రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ‌ర్ కు బీసీసీఐ షాక్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బీసీసీఐకి షాక్ ఇచ్చింది. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. డ‌గౌట్ లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడినందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం డ‌గౌట్ లో కూర్చుని ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు వాడడం నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ కు జరిమానా విధించారు.

ఈ సంఘ‌ట‌న‌లో రోమీ భిందర్ పక్కన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూర్చున్న సంగతి తెలిసిందే. అతనిపై కూడా వేటు వేస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ కేవలం రోమీ భిందర్ పై ఫైన్ వేసింది. దీంతో వైభవ్ కు రిలీఫ్ దక్కింది. కాగా బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య గ‌త వారం మ్యాచ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఫోన్ వాడుతూ రోమీ భిందర్ దొరికిపోయాడు.

Next Story