- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్.. గెలిస్తే నేరుగా ఫైనల్స్
నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ గుజరాత్, బెంగళూరు మధ్య జరుగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వేదికగా ఉండనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు వర్షం ఎఫెక్ట్ లేదని సమాచారం. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు, మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఛేజింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఇక మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్, డేంజర్ ఓపెనర్లతో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. అటు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి స్టార్ బౌలర్లతో బెంగళూరు కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్ మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య ఫైట్ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళితే... ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ లలో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది.






