కాన్వాయే కాదు మహానాడు గురించీ ఆలోచించండి : రోజా

by velandi.Saikiran |   (  Updated:2026-05-14 20:45:03  IST  )

కాన్వాయే కాదు మహానాడు గురించీ ఆలోచించండి అంటూ సీఎం చంద్ర‌బాబుకు రోజా కౌంట‌ర్ ఇచ్చారు.

కాన్వాయే కాదు మహానాడు గురించీ ఆలోచించండి : రోజా
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్ లను తగ్గించేశారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే దీనిపై వైసీపీ పార్టీ తరఫున మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. కాన్వాయే కాదు, మహానాడు గురించీ ఆలోచించండి అంటూ చురకలు అంటించారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పై విమర్శలు చేయడానికి నిర్వహిస్తున్న మహానాడుకు గురించి కూడా చంద్రబాబు ఆలోచించాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండు వాహనాలకు తమ కాన్వాయ్‌ను కుదించుకున్నామని చంద్ర‌బాబు, లోకేష్‌ సోషల్ మీడియా, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని సెటైర్లు పేల్చారు. అదే సమయంలో జ‌గ‌న్ పై విమర్శలు చేయడానికి నిర్వహిస్తున్న మహానాడుకు అయ్యే భారీ ఖర్చుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కౌంట‌ర్ ఇచ్చారు. మహానాడుకు వచ్చే వేలాది నాయకుల వాహనాల ఇంధన, అక్కడ వినియోగించే జనరేటర్లకు అయ్యే డీజిల్ ఖర్చులు, ఏర్పాట్లు ఇవన్నీ కలిపి ఎంత ప్రజాధనం, ఎంత ఇంధనం వృథా అవుతుందో ? లెక్కిస్తే ఆశ్చర్యమే అంటూ ఆగ్ర‌హించారు. సాధారణ ప్రజలకు పొదుపు సందేశాలు ఇచ్చే నాయకులు, ఇలాంటి భారీ రాజకీయ ఆర్భాటాల ఖర్చులను కూడా తగ్గించాల‌ని కోరారు.

Next Story