- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దిన సారథి రోహిత్ శర్మ. ఎంఐని ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అయితే, ముంబై ఫ్రాంచైజీ 2024 సీజన్‌లో రోహిత్‌ను సారథిగా తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 10న రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో రోహిత్‌ను మళ్లీ ఎంఐ కెప్టెన్‌గాచ చూసే అవకాశాలు ఎక్కువే. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. వెన్ను నొప్పితో ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. వారం రోజులు అతన్ని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చూసినట్టు తెలిసింది.
ముంబై ప్లేయర్లు బుధవారమే రాయ్‌పూర్‌కు చేరుకోగా.. అందులో పాండ్యా లేడు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉంటాడా? అంటే డౌటే. మరోవైపు, లక్నోతో మ్యాచ్‌లో పాండ్యా గైర్హాజరీలో సూర్య జట్టుకు నాయకత్వం వహించాడు. గురువారం అతని భార్య కూతురికి జన్మనిచ్చిన నేపథ్యంలో సూర్య కూడా ఆర్సీబీతో గేము ఆడతాడా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ పాండ్యా, సూర్య ఆ మ్యాచ్‌కు అందుబాటులోకి రాకపోతే ముంబై ఫ్రాంచైజీ రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే హిట్‌మ్యాన్ అభిమానులే కాదు ఎంఐ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉంటారు. ఈ సీజన్‌లో ఎంఐ పెద్దగా ఆకట్టుకోలేదు. 10 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.






