- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఇండియన్స్‌కు షాక్: రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ శర్మ
వాంఖడే వేదికగా జరుగుతున్న భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే వేదికగా జరుగుతున్న భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడారు(Retired Hurt). ఇన్నింగ్స్ 5.2 ఓవర్ల వద్ద రోహిత్ శర్మ అసౌకర్యానికి గురయ్యారు. ఫిజియో పరీక్షించిన అనంతరం, ఇన్నింగ్స్ కొనసాగించలేక ఆయన రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరారు. రోహిత్ తప్పుకున్నప్పటికీ, ముంబై పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. రోహిత్ స్థానంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చారు. ప్రస్తుతం సూర్యకుమార్ (13), ఓపెనర్ రికెల్టన్ (37) పరుగులతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఆర్సీబీ నిర్దేశించిన 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ గాయం ముంబై శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ గాయం తీవ్రత తక్కువగా ఉంటే, నిబంధనల ప్రకారం రోహిత్ చివర్లో మళ్ళీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.






