- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిషబ్ పంత్ కు గాయం..RCB టార్గెట్ ఎంతంటే ?
బెంగళూరు, లక్నో మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయం అయింది.

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో లక్నో తడబడింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో, 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 40 పరుగులు, ఆయుష్ బదోని 38 పరుగులు చేశాడు. చివరలో ముకుల్ చౌదరి 39 పరుగులు చేసి రాణించాడు. ఈ ముగ్గురు మినహా మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో 146 పరుగుల వద్ద ఆలౌట్ అయింది లక్నో.
రిషబ్ పంత్ కు గాయం
బెంగళూరు, లక్నో మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయం అయింది. ఆర్సీబీ బౌలర్ హేజిల్ వుడ్ వేసిన ఓ అద్భుతమైన బంతి, పంత్ చేతికి తగిలింది. దీంతో బ్యాటింగ్ చేయలేక పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత లక్నో వికెట్లు పడిన నేపథ్యంలో చేతికి బ్యాండేజ్ వేసుకొని మరీ బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. అయినప్పటికీ బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డ పంత్, వెంటనే ఔట్ అయ్యాడు. ఈ గాయం తీవ్రతరం అయితే తర్వాతి మ్యాచ్ లో పంత్ ఆడేది డౌట్ అంటున్నారు.






