- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mumbai Indians: వాంఖడేలో రికెల్టన్ విధ్వంసం.. సన్‌రైజర్స్‌కు భారీ టార్గెట్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ ముందు 244 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
ఇన్నింగ్స్ సాగిందిలా..
బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయికి ఓపెనర్లు విల్ జాక్స్ (46), రికెల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో విల్ జాక్స్ ఔటవడంతో ఈ భాగస్వామ్యం బ్రేక్ అయింది. ఆ వెంటనే వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) ఎషాన్ మలింగ బౌలింగ్‌లో తక్కువకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా రికెల్టన్ తన జోరు తగ్గించలేదు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతనికి తోడుగా నమన్ ధీర్ (22), హార్దిక్ పాండ్య (31; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు రాబట్టారు. చివర్లో హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ (7) ఔటైనప్పటికీ.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రికెల్టన్ వరుసగా ఫోర్, సిక్స్ బాది ముంబయి స్కోరును 243కి చేర్చాడు. సన్‌రైజర్స్ బౌలర్లు ముంబయి బ్యాటర్లను నిలువరించడంలో తేలిపోయారు. నితీశ్ రెడ్డి, ఎషాన్ మలింగ, ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ పడగొట్టారు.






