IPL 2026 : గుజరాత్ పై బెంగుళూరు విజయం

by Muthe.Rajitha |

IPL లో నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB, GT జట్ల మధ్య జరిగిన మ్యాచులో బెంగుళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2026 : గుజరాత్ పై బెంగుళూరు విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ పై బెంగుళూరు సూపర్ విక్టరీ సాధించింది. IPL లో నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB, GT జట్ల మధ్య జరిగిన మ్యాచులో బెంగుళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగిపోయాడు. గిల్(32), బట్లర్(25) పరుగులతో పరవాలేదనిపించారు. ఇక అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB.. 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. కోహ్లీ(81), పడిక్కల్(55) పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక వచ్చిన పాటీదార్(8), జితేష్(10) పరుగులు మాత్రమే చేయగా.. చివర్లో రేగిన ఉత్కంఠతను కృనాల్(23*) పరుగులతో గెలుపు సునాయాసం చేసాడు. ఈ గెలుపుతో RCB టాప్ 2 లోకి దూసుకు పోయింది.

Next Story