- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2026: పోరాడి ఓడిన ముంబై.. ఆర్సీబీ ఖాతాలో మరో విజయం
ముంబై వేదికగా నేడు జరిగిన IPL మ్యాచులో బెంగుళూరు జట్టు ముంబైని చిత్తుగా ఓడించింది.

దిశ, వెబ్ డెస్క్ : ముంబై వేదికగా నేడు జరిగిన IPL మ్యాచులో బెంగుళూరు జట్టు ముంబైని చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా RCB బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్(78), విరాట్ కోహ్లీ(50), పటిదార్(53) పరుగులు చేసారు. అనంతరం 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు మాత్రమే చేసింది. బెంగుళూరు కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో ముంబై స్కోర్ నత్తనడకన సాగింది. సూర్యకుమార్ యాదవ్(33), హార్దిక్ పాండ్య(40), రూథర్ ఫర్డ్(71), రియాన్(37) పరుగులు చేసారు. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలం కాగా బెంగుళూరు 18 పరుగుల తేడాతో సునాయాస విజయం సాధించింది. RCB బౌలర్స్ లోసుయాశ్ శర్మ 2, క్రునాల్,జాకబ్ తలో వికెట్ తీసారు. ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇది మూడో విజయం కాగా.. ముంబయికి మూడో ఓటమి కావడం గమనార్హం.






