IPL 2026 : ఆర్సీబీ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఎలిమినేట్

by Harish |

IPL 2026 : ఆర్సీబీ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఎలిమినేట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఆ జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబైని ఆర్సీబీ మోస్తరు స్కోరుకే కట్టడి చేసింది. భువనేశ్వర్ 4 వికెట్లతో రెచ్చిపోయి ప్రత్యర్థిని నిలువరించాడు. అయితే, తిలక్ వర్మ(57), నమన్ ధిర్(47) రాణించడంతో ముంబై చివరికి 166/7 స్కోరు చేసింది. ఇక, ఛేదనలో ఆర్సీబీ కూడా తడబడింది. కానీ, కృనాల్ పాండ్యా జట్టును ఆదుకున్నాడు. 46బంతుల్లో 73 రన్స్ చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్స్ టేబుల్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

Next Story