ర‌జ‌త్ పాటిద‌ర్ ఊచ‌కోత‌...గుజ‌రాత్ ముందు భారీ టార్గెట్

by velandi.Saikiran |

ర‌జ‌త్ పాటిద‌ర్ ఊచ‌కోత కోశాడు..దీంతో బెంగ‌ళూరు భారీ స్కోర్ చేసింది.

ర‌జ‌త్ పాటిద‌ర్ ఊచ‌కోత‌...గుజ‌రాత్ ముందు భారీ టార్గెట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో బెంగళూరు ఇరగదీసింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించింది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఇవాళ్టి మ్యాచ్ లో ఊచకోత కోశాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసిన రజత్, సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ బెంగుళూరుకు భారీ స్కోర్ అందించి.. సత్తా చాటాడు. తన ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు, ఐదు బౌండరీలు ఉన్నాయి. 280 స్ట్రైక్ రేట్ తో గుజరాత్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలవాలంటే, 255 పరుగుల భారీ టార్గెట్ ఛేదించాల్సి ఉంది. ఒకవేళ ఇందులో గుజరాత్ ఓడిపోతే..RCB నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్తుంది.

Next Story