నేడు RCB vs GT పోరు

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు మరో ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది.

నేడు RCB vs GT పోరు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు మరో ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. కాబట్టి ఈరోజు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తుంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, కెప్టెన్ రజత్ పటీదార్ మెరుపులు ఆ జట్టుకు ప్రధాన బలం. సొంత గడ్డపై ఆడుతుండటం వల్ల వారికి అభిమానుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ అనుభవం, హేజిల్‌వుడ్, కృనల్ పాండ్యా బౌలింగ్ కీలకం కానుంది.

ఇక గుజరాత్ జట్టు చాలా నిలకడగా కనిపిస్తోంది. శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. రషీద్ ఖాన్ మ్యాజిక్, మహమ్మద్ సిరాజ్ ల దాడిని ఎదుర్కోవడం RCB బ్యాటర్లకు సవాలే. చిన్నస్వామి స్టేడియం హోమ్ టీమ్‌కు ఎక్కువ అనుకూలంగా ఉండగా... గుజరాత్ టైటాన్స్ వద్ద ఉన్న ప్రపంచ స్థాయి బౌలర్లు బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేయగలిగితే ఫలితం ఎలాగైనా ఉండవచ్చు.

Next Story