RCB vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

by Ramesh Naini |   (  Updated:2026-04-05 13:54:43  IST  )

ఐపీఎల్ 2026 లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న 11వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడుతున్నాయి.

RCB vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న 11వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

సీఎస్‌కే వ్యూహం.. ఆర్సీబీ స్పందన

భారీ స్కోర్లు నమోదయ్యే ఈ మైదానం ఛేజింగ్‌కు అనుకూలిస్తుందని, ఆర్సీబీని సాధ్యమైనంత తక్కువ స్కోరుకే కట్టడి చేస్తామని రుతురాజ్ తెలిపారు. ఎంఎస్ ధోని క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే మైదానంలోకి వస్తాడని స్పష్టం చేశారు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు.

పిచ్ రిపోర్ట్..

ఇయాన్ బిషప్, ఫాఫ్ డుప్లెసిస్ అంచనా ప్రకారం.. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ పిచ్‌లలో ఒకటి. ఇక్కడ మంచి బౌన్స్ లభిస్తుంది. బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీయకపోతే భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం.

తుది జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్ (CSK): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫ్ఫీ.

Next Story