RCBకి బిగ్ రిలీఫ్... డేంజర్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు !

by velandi.Saikiran |

డేంజర్ ప్లేయర్ ఫిల్ సాల్ట్.. తిరిగి బెంగుళూరు జట్టులో చేరబోతున్నాడు ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

RCBకి బిగ్ రిలీఫ్... డేంజర్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. డేంజర్ ప్లేయర్ ఫిల్ సాల్ట్.. తిరిగి బెంగుళూరు జట్టులో చేరబోతున్నాడు ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏప్రిల్ మాసంలో 18వ తేదీన ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. క్యాచ్ అందుకోబోయే గాయపడ్డాడు ఫిల్ సాల్ట్. ఈ క్రమంలో అతని ఎడమ చేతికి గాయమైంది. దీంతో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. దాదాపు నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న సాల్ట్.. ఇప్పుడు ఆర్సీబీలో చేరేందుకు సిద్ధమవుతున్నాడట.

ఇప్పటికే ఇండియాకు వచ్చేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. మే 26వ తేదీన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కూడా ఫిల్ సాల్ట్ ఆడతాడని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గాయం కారణంగా ఫిల్ సాల్ట్ జట్టుకు దూరం కావడంతో... అతని స్థానంలో బెథెల్ ఓపెన‌ర్ గా బరిలోకి దిగాడు. సాల్ట్ వస్తే బెథెల్ పై వేటు వేసే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ లోకి ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. అటు గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ కూడా వచ్చేశాయి. నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.

Next Story