IPL 2026: ఢిల్లీపై ఆర్సీబీ సునాయాస విజయం

by Gantepaka Srikanth |

అరుణ్ జైట్లీ మైదానంలో ఆర్సీబీ బౌలర్లు సృష్టించిన బీభత్సానికి ఢిల్లీ క్యాపిటల్స్ కుప్పకూలిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించి, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

IPL 2026: ఢిల్లీపై ఆర్సీబీ సునాయాస విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ జైట్లీ మైదానంలో ఆర్సీబీ బౌలర్లు సృష్టించిన బీభత్సానికి ఢిల్లీ క్యాపిటల్స్ కుప్పకూలిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించి, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. భువనేశ్వర్ కుమార్, హేజల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో ఢిల్లీ జట్టు కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. కనీసం 100 పరుగుల మార్కును కూడా అందుకోలేక ఢిల్లీ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బెథెల్ 22 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేశారు. బెథెల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 13 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఆయన బ్యాటింగ్ చూస్తుంటే టీ20 ఫార్మాట్‌కు కొత్త నిర్వచనం ఇచ్చినట్లు అనిపించింది. కింగ్ కోహ్లీ మరోవైపు తనదైన శైలిలో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. పడిక్కల్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేసి ఆర్సీబీకి ఘనవిజయాన్ని అందించారు. ఈ భారీ విజయంతో ఆర్సీబీ తన నెట్ రన్ రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుంది. ఒకే ఓవర్లో వికెట్లు తీసిన భువీ, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హేజల్‌వుడ్ ఈ విజయానికి ప్రధాన కారకులు కాగా, పడిక్కల్ మెరుపులు మ్యాచ్‌ను త్వరగా ముగించాయి.

Next Story