వ‌దిలేసినందుకు చెన్నైపై ప‌గ‌తీర్చుకున్న జ‌డేజా..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 ట్రేడింగ్ ద్వారా వ‌దిలేసినందుకు చెన్నైపై ప‌గ‌తీర్చుకున్నాడ‌ని జ‌డేజా వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

Ravindra Jadeja is looking so angry at CSK at ipl 2026
X

Ravindra Jadeja is looking so angry at CSK at ipl 2026

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ డేంజర్ ప్లేయర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. తొలి మ్యాచ్ లోనే రెండు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మొత్తం మూడు ఓవర్లు సంధించాడు. ఈ క్రమంలో కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్ వికెట్లను పడగొట్టి ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రవీంద్ర జడేజా.

రవీంద్ర జడేజా గన్ ఫైర్ సెలబ్రేషన్స్

గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేసి అందరినీ ఆసక్తికున్నాడు జ‌డ్డూ భాయ్. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా గురించి రకరకాల పోస్టులు పెడుతున్నారు. తనను ట్రేడింగ్ ద్వారా వదిలేసినందుకుగాను చెన్నై పైన జడేజా పగ తీర్చుకున్నాడని కొంత మంది అంటున్నారు. గత సీజన్ వరకు చెన్నై హీరోగా పేరుగాంచిన ఆయన ఇప్పుడు అదే జట్టుకు విలన్ గా మారిపోయాడని మరికొంతమంది సీఎస్కే అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జడేజా గన్ ఫైర్ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. కాగా ఈ మ్యాచ్ లో చెన్నైపై 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

Next Story