RR vs MI : రాజస్థాన్‌ సూపర్ విక్టరీ

by Muthe.Rajitha |

గుహవటి వేదికగా జరిగిన నేటి IPL మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది.

RR vs MI : రాజస్థాన్‌ సూపర్ విక్టరీ
X

దిశ,వెబ్ డెస్క్ : గుహవటి వేదికగా జరిగిన నేటి IPL మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా ఓవర్లను కుదించగా.. నిర్ణీత 11 ఓవర్లకు 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. జైస్వాల్ (77*), సూర్యవంశీ (39), రియాన్ పరాగ్ (20) భారీ పరుగులు చేసారు. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లకు 123 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో 27 పరుగుల తేడాతో రాజస్థాన్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. రూథర్‌ఫోర్డ్ (25), నమన్ ధీర్ (25), తిలక్ వర్మ (14) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో నంద్రీ బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ తీశారు.

Next Story