IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమైంది.

IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమైంది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హోరాహోరీ పోరు ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, చేజింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఉప్పల్ స్టేడియం సన్ రైజర్స్‌కు కంచుకోట వంటిది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో భారీ స్కోరు సాధించాలని కమిన్స్ సేన భావిస్తోంది. బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్, పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయాలని యోచిస్తోంది. సోమవారం కావడంతో ఉప్పల్ మైదానం అభిమానులతో కిక్కిరిసిపోయింది. "ఆరెంజ్ ఆర్మీ" నినాదాలతో స్టేడియం హోరెత్తుతోంది. సొంత ప్రేక్షకుల మధ్య సన్ రైజర్స్ భారీ స్కోరు చేస్తుందా? లేక రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేస్తారా? అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.

Next Story