- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PBKS vs RR : రాజస్థాన్ వీరవిహారం.. పంజాబ్ కు తొలి ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.
రాజస్థాన్ బ్యాటర్ల వీరవిహారం
భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుండే ధాటిగా ఆడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(51) అర్ధసెంచరీతో శుభారంభాన్ని అందించగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఫెర్రీరా (52*), శుభమ్ దూబె (31*) హాఫ్ సెంచరీలతో రాణించి విజయాన్ని ఖాయం చేశాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీసినప్పటికీ, భారీ స్కోరును కాపాడుకోలేకపోయారు.
పంజాబ్ ఇన్నింగ్స్ - స్టోయినిస్ విధ్వంసం
ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59) ఆకట్టుకోగా, చివర్లో మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్, కూపర్ కానెల్లీ కూడా తలా 30 పరుగులతో సహకరించారు. రాజస్థాన్ బౌలర్లలో యశ్‌రాజ్ పుంజ 2 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీసుకున్నారు. మొత్తానికి నేడు ముల్లాన్‌పుర్ స్టేడియం పరుగుల వరదతో హోరెత్తింది. రాజస్థాన్ బ్యాటర్ల నిలకడైన ప్రదర్శన ముందు పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యం చిన్నబోయింది.






