- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KKRకు బిగ్ షాక్... అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్
అర్ధాంతరంగా కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఆగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ ఊహించిందే జరిగింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందే ఈడెన్ గార్డెన్స్ లో చిరు జల్లులు పడగా... మ్యాచ్ లో ఎనిమిది ఓవర్లు పూర్తయ్యే సరికి మళ్లీ వర్షం షురూ అయింది. దీంతో అర్ధాంతరంగా కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్, 8 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 57 పరుగులు సాధించింది.
ఆది నుంచి కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ మొత్తాన్ని కూల్చేశారు. దీంతో మ్యాచ్ మొత్తం కేకేఆర్ చేతిలోకి వచ్చేసింది. మరో రెండు కీలక వికెట్లు పడగొడితే, వందలోపే ముంబై ఇండియన్స్ ను ఆలౌట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంతలోనే కేకేఆర్ కు షాక్ ఇచ్చాడు వరుణ దేవుడు. అయితే వర్షం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని.. అతి త్వరగానే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఇందులో కేకేఆర్ గెలిస్తేనే, ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత పెంచుకుంటుంది. లేకపోతే ఇంటి దారి పట్టాల్సిందే.






