- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ అభిమానులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ ను కూడా వరుణుడు వెంటాడుతున్నాడు. అస్సాంలోని గువాహటి వేదికగా ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ మ్యాచ్ జరుగాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది.
సాయంత్రం నుంచి గువాహటిలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మైదానం ఇంకా తడిగా ఉన్న నేపథ్యంలో టాస్ ఆలస్యంగా వేయనున్నారు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం మళ్లీ పడితే, సూపర్ ఓవర్ అయినా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. లేదా నిన్నటి లాగా మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం ఉంటుంది. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది.






