IPLలో బౌండరీ సైజ్‌ పెంచాల్సిందే...మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

by velandi.Saikiran |

ఐపీఎల్ లో బౌండరీని మరో 30 అడుగులు పొడిగించాలని డిమాండ్ చేశారు దిలీప్ వెంగ్‌సర్కార్.

IPLలో బౌండరీ సైజ్‌ పెంచాల్సిందే...మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ టోర్నమెంట్ లో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. సాధార‌ణ‌ బౌలర్ కూడా అవలీలగా సిక్సులు కొట్ట గలుగుతున్నాడు. బుమ్రా లాంటి బౌలర్లను కూడా చీల్చి చెండాడుతున్నారు బ్యాటర్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ లో 200పైగా స్కోర్లు సులభంగా నమోదు కావడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్. సిక్సర్లు, బౌండరీలతో బ్యాటర్లు డామినేట్ చేస్తున్నారని వెల్లడించారు. దీని వల్ల బౌలర్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోందని స్పష్టం చేశారు.

30 అడుగులు బౌండ‌రీ లైన్ పెంచాల్సిందే

ఇదే ట్రెండు కొనసాగితే, ఎవరు కూడా బౌలర్ కావాలని అనుకోరంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దిలీప్ వెంగ్‌సర్కార్. ఇది మంచి పద్ధతి కాదంటూ కీలక సూచనలు చేశారు. ఐపీఎల్ లో బౌండరీని మరో 30 అడుగులు పొడిగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే మ్యాచ్ ఏక పక్షంగా కాకుండా బౌలర్లు వర్సెస్ బ్యాటర్ల మధ్య పోటీ సమంగా ఉంటుందని సూచనలు చేశారు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, RCB ఇలాంటి జట్లు అవలీలగా 200 కు పైగా పరుగులు సాధిస్తున్నాయి. 50 కి 5 వికెట్లు పడినా కూడా ఆ తర్వాత పుంజుకొని 200 దాటుతున్నాయి.

Next Story