- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: పంజాబ్ కింగ్స్ జోరుకు రాయల్స్ బ్రేక్ వేస్తారా?
ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య న్యూ చండీగఢ్ వేదికగా మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్లు కూడా ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. ఇప్పటికే ఆరు విజయాలు నమోదు చేసుకున్న పంజాబ్, పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఇటు మొన్న హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో ఉంది.
ఎలాగైనా పంజాబ్ కింగ్స్ పైన విజయం సాధించి, ముందుకు దూసుకు వెళ్లాలని రాజస్థాన్ రాయల్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక టోర్నమెంట్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 30 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. ఇందులో 17 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పై చేయి సాధించింది. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తే పంజాబ్ చాలా బలంగా కనిపిస్తోంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.






