- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ముంబైతో పోరు.. పంజాబ్ ఇవాళ గెలిస్తేనే?
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాలలో ఆసక్తికర ఫైట్ ఉండనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాలలో ఆసక్తికర ఫైట్ ఉండనుంది. టోర్నమెంట్ ఆరంభంలో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములు చవి చూసింది. మొన్నటి వరకు పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న పంజాబ్ కింగ్స్, దిగజారి నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ చివరి మూడు మ్యాచ్ లలో గెలిచి, ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని పంజాబ్ కింగ్స్ సిద్ధమవుతోంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కానీ మిగిలిన మ్యాచులైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది ముంబై ఇండియన్స్. ఇక ఇవాళ జరిగే మ్యాచ్ కు కూడా హార్దిక్ పాండ్యా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య కుమారి యాదవ్ జట్టును లీడ్ చేస్తాడు.
ఇరు జట్ల బలాబలాలు
ఐపీఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 35 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో పంజాబ్ కింగ్స్ పై చేయి సాధించింది. ముంబై ఇండియన్స్ పై ఏకంగా 18 సార్లు విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. అటు 17 మ్యాచ్ లలోనే ముంబై గెలవడం గమనార్హం. ప్రస్తుత ఫామ్ ప్రకారం కూడా పంజాబ్ కింగ్స్ కు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండనుంది. దానికి తోడు ధర్మశాల పంజాబ్ హోమ్ గ్రౌండ్. ఈ లెక్కన ముంబై ఇండియన్స్ కంటే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.






