పెద్ది మూవీ తొలిరోజు కలెక్షన్.. రూ.210 కోట్లు పక్కా?

by velandi.Saikiran |   (  Updated:2026-05-27 09:33:04  IST  )

పెద్ది మూవీ తొలిరోజు కలెక్షన్ రూ.210 కోట్లు పక్కా అంటూ సోష‌ల్ మీడియా హైప్ పెంచుకున్నారు.

పెద్ది మూవీ తొలిరోజు కలెక్షన్.. రూ.210 కోట్లు పక్కా?
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చరణ్ హీరోగా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా, జూన్ 4వ తేదీన రిలీజ్ కానుంది. మూడో తేదీన ప్రీమియర్లు పడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1980 సంవత్సరంలో ఏపీకి చెందిన ఓ గ్రామ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇందులో ఊరి కోసం రామ్ చరణ్ ఎలాంటి త్యాగాలు చేశాడన్నది సినిమా కథ. అయితే జూన్ 4వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మొదటి రోజున రూ. 210 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని రామ్ చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఇప్పుడే రచ్చ మొదలుపెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డులు ఈ సినిమా సృష్టిస్తుందని హైప్ పెంచుతున్నారు. ఈ మేర‌కు పోస్టులు పెట్టి, ర‌చ్చ చేస్తున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత పెద్ది సినిమాపై అంచ‌నాలు భారీగానే పెరిగాయి. మ‌రో ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. ఇక సినిమా క‌థ క్లిక్ అయితే మాత్రం, ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం గ్యారెంటీ అని సినీ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు.

Next Story