- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్కంఠ మ్యాచులో పంజాబ్ విజయం.. చెన్నైకి తప్పని మరో ఓటమి
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో సీఎస్కెపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో సీఎస్కెపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. గైక్వాడ్ (28), ఆయూష్ (73), దూబే (45), సర్ఫరాజ్ (32) అద్భుతంగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ రెండు, బార్క్లెట్, జేసన్, చాహల్ తలో వికెట్ తీశారు. ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చివరి వరకు పోరాడి 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఈ మ్యాచులో చివరకు పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం ఖాతాలో వేసుకుంది. PBKS బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య (39), ప్రభమన్ సింగ్ (43), అయ్యర్ (50), కనోలి (36) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నైకి ఇది రెండో ఓటమి కాగా.. పంజాబ్ కు ఇది రెండో విజయం.






