- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026లో మరో విషాదం
ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ( Azmatullah Omarzai) తల్లి మరణించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ కొనసాగుతున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేయర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ( Azmatullah Omarzai) తల్లి మరణించారు. గత కొన్ని రోజులుగా ఒమర్జాయ్ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, ఈ క్రమంలో ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఒమర్జాయ్ తల్లి.. ఆస్పత్రిలోనే మరణించారని సమాచారం. ఈ నేపథ్యంలో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. అటు ఆఫ్గాన్ క్రికెటర్లు నబీ, జన్నత్ సైతం అజ్మతుల్లా ఒమర్జాయ్ కి సంతాపం తెలిపారు. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2026 లో అజ్మతుల్లా ఒమర్జాయ్ కు పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లో ఇప్పటి వరకు చోటు దక్కలేదు.
Read More.. ఐపీఎల్ చరిత్రలో పరమ చెత్త రికార్డు
Next Story






