SRHకు ఎదురుదెబ్బ‌...ఆస్ట్రేలియాకు తిరిగెళ్లిన కమిన్స్

by velandi.Saikiran |

వెనునొప్పితో బాధ‌ప‌డుతోన్న పాట్ కమ్మిన్స్, హైదరాబాద్ నుంచి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు.

SRHకు ఎదురుదెబ్బ‌...ఆస్ట్రేలియాకు తిరిగెళ్లిన కమిన్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేకేఆర్ పై విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఊహించని షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు పాట్ కమ్మిన్స్ ( Pat Cummins) తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. మొన్నటి వరకు ఇండియాలోనే ఉన్న పాట్ కమ్మిన్స్, గాయం కారణంగా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. వెన్ను నొప్పి నుంచి కోటుకుంటోన్న‌ పాట్ కమ్మిన్స్.. రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకే తొలి రెండు మ్యాచ్ ల‌కు దూరమయ్యాడు. వచ్చే వారం నుంచి అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ ల‌కు అందుబాటులో ఉంటాడని అభిమానులందరూ అంచనా వేసుకున్నారు. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ పాట్ కమ్మిన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

వెనునొప్పితో బాధ‌ప‌డుతోన్న పాట్ కమ్మిన్స్

వెనునొప్పితో బాధ‌ప‌డుతోన్న పాట్ కమ్మిన్స్, హైదరాబాద్ నుంచి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఆస్పత్రిలో ఫైనల్ మెడికల్ స్కానింగ్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, కావ్య పర్మిషన్ వచ్చిన నేపథ్యంలోనే తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా వెళ్లిపోయిన పాట్ కమ్మిన్స్, ఈ నెల 17వ తేదీన మళ్లీ ఇండియాకు వస్తాడని అంటున్నారు. ఆ డేట్ మిస్ అయితే మేలోనే పాట్ కమ్మిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సరైన బౌలింగ్ లైనప్ లేని తరుణంలో పాట్ కమ్మిన్స్ ఇలా ఆస్ట్రేలియాకు వెళ్లడం సన్ రైజర్స్ అభిమానులకు కొత్త టెన్షన్ నెల‌కొంది. త్వరగా అతను కోల్కొని జట్టులోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Next Story