రేపే ఎలిమినేట‌ర్ మ్యాచ్..ప్యాట్ క‌మిన్స్‌ షాకింగ్ స్టేట్ మెంట్ !

by velandi.Saikiran |

రేపు ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఉన్న‌త‌రుణంలో ప్యాట్ క‌మిన్స్‌ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

రేపే ఎలిమినేట‌ర్ మ్యాచ్..ప్యాట్ క‌మిన్స్‌ షాకింగ్ స్టేట్ మెంట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా బుధవారం స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ వేదికగా నిర్వహించనున్నారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ సారి టైటిల్ గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

కలిసికట్టుగా ఆడి ఐపీఎల్ 2026 టైటిల్ అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. రాజస్థాన్ రాయల్స్ పైన సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్ర‌తీ మ్యాచ్ ఫైన‌ల్స్ లాగా ఆడ‌తామ‌న్నారు. ఫైనల్స్ లో కూడా అదరగొట్టడం గ్యారెంటీ అని హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కాగా బుధవారం రాజస్థాన్ రాయల్స్ పైన హైదరాబాద్ విజయం సాధిస్తే, క్వాలిఫైయర్ 2 ఆడనుంది. అక్కడ దాదాపు గుజరాత్, SRH మధ్య మ్యాచ్ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Next Story