పాండ్య నిర్ణయం: ముందుగా బౌలింగ్.. చెన్నై బ్యాటింగ్‌ ప్రారంభం

by Ramesh Naini |   (  Updated:2026-04-23 14:12:02  IST  )

ఐపీఎల్‌లో భాగంగా ముంబై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), ముంబై ఇండియన్స్‌ (MI) మధ్య ఆసక్తికర పోరు మొదలైంది.

పాండ్య నిర్ణయం: ముందుగా బౌలింగ్.. చెన్నై బ్యాటింగ్‌ ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్‌లో భాగంగా ముంబై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), ముంబై ఇండియన్స్‌ (MI) మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఇరు జట్లూ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో పటిష్టమైన తుది జట్లను బరిలోకి దించాయి. డి కాక్, సూర్యకుమార్, బుమ్రా వంటి స్టార్లతో ముంబై లైనప్ బలంగా ఉండగా.. సంజు శాంసన్, శివమ్ దూబె, సర్ఫరాజ్ ఖాన్‌లతో చెన్నై జట్టు బ్యాటింగ్ లైనప్ ఆకట్టుకుంటోంది.

తుది జట్టు వివరాలు..

మ్యాచ్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్, ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ల వివరాలు చూస్తే.. ముంబై ఇండియన్స్‌ తుది జట్టు (Playing XI).. క్వింటన్‌ డి కాక్‌ (వికెట్‌ కీపర్‌), నమన్‌ ధీర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రూథర్‌ ఫోర్డ్‌, మిచెల్‌ శాంట్నర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, క్రిష్‌ భగత్‌, ఏఎమ్‌ ఘజన్‌ఫర్‌, అశ్వని కుమార్‌. ఇంపాక్ట్‌ ప్లేయర్లు.. విల్‌ జాక్స్‌, రాజ్‌ భావ, శార్దూల్‌ ఠాకూర్‌, దానిష్‌ మలేవర్‌, మయాంక్‌ మార్కండే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తుది జట్టు (Playing XI).. సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌, డెవాల్డ్‌ బ్రేవిస్‌, శివమ్‌ దూబె, కార్తిక్‌ శర్మ, జెమీ ఓవర్టన్‌, నూర్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, ముకేశ్‌ చౌదరి. ఇంపాక్ట్‌ ప్లేయర్లు.. ప్రశాంత్‌ వీర్‌, మ్యాథ్యూ షార్ట్‌, మ్యాట్‌ హెన్రీ, అకేల్‌ హొసేన్‌, ఉర్విల్‌ పటేల్‌.

Next Story