- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లీన్ స్వీప్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ రెండూ ‘ఆరెంజ్ ఆర్మీ’ ఖాతాలోకే!
2026 IPL టోర్నీలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండింటినీ సన్‌రైజర్స్ ఆటగాళ్లే కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ (SRH) జట్టు అజేయంగా దూసుకుపోవడమే కాకుండా, వ్యక్తిగత రికార్డుల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఏప్రిల్ 29 నాటికి.. టోర్నీలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండింటినీ సన్‌రైజర్స్ ఆటగాళ్లే కైవసం చేసుకోవడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్‌రైజర్స్ చూపిస్తున్న ఈ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదనిపిస్తోంది.
ఆరెంజ్ క్యాప్- అభిషేక్
బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ పరుగుల సునామీ సృష్టిస్తూ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో అతను 425 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు తోడుగా సన్‌రైజర్స్ కే చెందిన మరో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 414 పరుగులతో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (400 రన్స్) మూడో స్థానానికి పడిపోవడంతో, టాప్-2 స్థానాలు సన్‌రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.
పర్పుల్ క్యాప్- ఇషాన్
బౌలింగ్ విభాగంలోనూ సన్‌రైజర్స్ తనదైన మార్క్ చూపిస్తోంది. ఆ జట్టు బౌలర్ ఏషాన్ మలింగా 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీస్తూ మలింగా జట్టులో అత్యంత స్థిరమైన బౌలర్‌గా ఎదిగాడు. అతని వెంటే భువనేశ్వర్ కుమార్ (RCB), అంశుల్ కాంబోజ్ (CSK), జోఫ్రా ఆర్చర్ (RR) తలా 14 వికెట్లతో గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, మలింగా తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండింటిలోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లను కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రస్తుతం ప్లే-ఆఫ్స్ రేసులో అత్యంత బలమైన జట్టుగా అవతరించింది.






