- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిల్లర్ తప్పేం లేదు..కుల్దీప్ నిర్లక్ష్యమే ఢిల్లీని ముంచేసింది
ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో మిల్లర్ తప్పేం లేదని, సరిగ్గా పరుగు తీయకుండా కుల్దీప్ తప్పు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సందర్భంగా గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉత్కంఠ పోరు సాగింది. చివరి వరకు సాగిన ఈ మ్యాచ్ లో పోరాడిన గుజరాత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయడంలో విఫలమయ్యాడని, రెండు బంతుల్లో ఒక్క పరుగైన చేస్తే మ్యాచ్ డ్రా అయ్యేదని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక్క సింగిల్ తీయకుండా ఢిల్లీని చేతులారా ఓడించింది మిల్లర్ అంటూ సీనియర్ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా మిల్లర్ చేసింది తప్పే అయినప్పటికీ, మరో ఎండ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ ను ఎందుకు విమర్శించడం లేదని మరి కొంత మంది క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. బౌలర్ ఎండ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్, బంతి పడక ముందే.. మిడిల్ పిచ్ వరకు వచ్చి ఉంటే పరిస్థితి వేరే లాగా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. అలా చేయకుండా కుల్దీప్ యాదవ్ నిర్లక్ష్యం వహించాడని మండిపడుతున్నారు. ఢిల్లీ ఓటమిలో మిల్లర్ కంటే కుల్దీప్ యాదవ్ పెద్ద తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు కూడా పెడుతున్నారు.
ఒకే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం
ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో గుజరాత్ మొదటి బ్యాటింగ్ చేసి 210 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన ఢిల్లీ, చేజేతులా మ్యాచ్ పోగొట్టుకుంది. చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సి ఉండగా, మిల్లర్ ఒక్క సింగిల్ కూడా తీయలేక విఫలమయ్యాడు. దీంతో సింగిల్ రన్ తేడాతో ఓడిపోయింది ఢిల్లీ. ఆ తర్వాత స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు మిల్లర్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






