- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైకి రిలీఫ్..గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ
ముంబైకి రిలీఫ్ దక్కింది..గుజరాత్ పై 99 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ విక్టరీ కొట్టింది. ఐపీఎల్ 2026లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై, ఇవాళ జరిగిన మ్యాచ్ లో మాత్రం అదరగొట్టింది. తన ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసి 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై ఇండియన్స్. గుజరాత్, ముంబై మధ్య మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 20 ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్, ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీ చేసి, తన సత్తా చాటాడు.
అదరగొట్టిన తిలక్ వర్మ..ముంబై రెండో విజయం
ఇక ముంబై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ తేలిపోయింది. ఏ ఒక్కరూ రాణించలేదు. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 26 పరుగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేసిన నేపథ్యంలో 15.5 ఓవర్లలో 100 పరుగులు చేసి ఆలౌట్ అయింది గుజరాత్ టైటాన్స్. కాగా, ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, శాంట్నర్, ఘజన్‌ఫర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, పాండ్యాకు తలో వికెట్ పడింది. దీంతో ఈ టోర్నమెంటులో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది ముంబై. పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉండగా, చిట్ట చివరన కేకేఆర్ నిలిచింది.






