IPL 2026: వాంఖడేలో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో భాగంగా 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్ తలపడుతున్నాయి.

IPL 2026: వాంఖడేలో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్ తలపడుతున్నాయి. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో లక్నో జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. వాంఖడే మైదానంలో సాధారణంగా రెండో ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఛేజింగ్ చేసే జట్టుకు బ్యాటింగ్ సులభమవుతుంది. అందుకే టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా, లక్నో జట్టును ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించి, లక్ష్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నారు.

జట్ల పరిస్థితి..

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఈ రెండు జట్లకూ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత కీలకం. ముంబై తరపున సూర్యకుమార్ యాదవ్, బుమ్రాపై భారీ అంచనాలు ఉండగా.. లక్నో జట్టు రిషబ్ పంత్, నికోలస్ పూరన్ మెరుపులపై ఆశలు పెట్టుకుంది. ముంబై బౌలర్లు లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేస్తారా? లేక లక్నో బ్యాటర్లు భారీ స్కోరు సాధించి ముంబైకి సవాల్ విసురుతారా? అనేది కాసేపట్లో తేలనుంది.

Next Story