- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడిపోయే మ్యాచ్ గెలిపించిన ముకుల్..చక్రం తిప్పిన ధోని
కేకేఆర్ పై విధ్వంసం సృష్టించిన లక్నో ఆటగాడు ముకుల్ చౌదరి, తన ఇన్నింగ్స్ ను ధోనీకి డెడికేట్ చేసినట్లు తెలిపాడు.

దిశ, వెబ్ డెస్క్: కేకేఆర్ చేతిలో ఓడిపోవాల్సిన లక్నోను చివరి క్షణంలో గెలిపించాడు ముకుల్ చౌదరి. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు..ముకుల్ చౌదరి గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. కేకేఆర్ వర్సెస్ లక్నో మధ్య గురువారం మ్యాచ్ జరగగా, 27 బంతుల్లో 54 పరుగులు చేసి LSGని విజయ తీరాలకు చేర్చాడు ముకుల్ చౌదరి. ఈ మ్యాచ్ లో ఏకంగా ఏడు సిక్సర్లు కొట్టిన ముకుల్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అచ్చం మహేంద్ర సింగ్ ధోని లాగా హెలికాప్టర్ షాట్ కూడా నిన్నటి మ్యాచ్ సందర్భంగా ఆడాడు. దీంతో ఇండియాకు మరో ధోని దొరికాడని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
ధోని చూస్తూ పెరిగిన ముకుల్ చౌదరి
కేకేఆర్ పై విధ్వంసం సృష్టించిన లక్నో ఆటగాడు ముకుల్ చౌదరి, తన ఇన్నింగ్స్ ను ధోనీకి డెడికేట్ చేసినట్లు తెలిపాడు. తాను ధోని బ్యాటింగ్ చూస్తూ పెరిగానని, అతని బ్యాటింగ్ ఆర్డర్ లోనే వస్తానని ప్రకటించాడు. తన కెరీర్ ఆరంభంలో ధోనినే తనకు అతిపెద్ద స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరో క్రికెటర్ కు ధోని స్ఫూర్తిగా నిలిచాడని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ లో జన్మించిన ముకుల్ చౌదరి, తన తండ్రి కోరిక మేరకు క్రికెటర్ అయ్యాడు. మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ చేసిన ముకుల్, ధోని స్ఫూర్తితో వికెట్ కీపర్ గా మారాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా 200 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు. ఈ క్రమంలోనే రూ .2.6 కోట్లకు ముకుల్ ను లక్నో కొనుగోలు చేసింది.






