CSK అభిమానులకు మరో ఎదురుదెబ్బ..ధోని రావ‌డం ఇక‌ క‌ష్ట‌మే!

by velandi.Saikiran |   (  Updated:2026-04-23 08:53:30  IST  )

గాయం నుంచి కోలుకున్నప్పటికీ... మహేంద్ర సింగ్ ధోని ఫిట్ నెస్ ఇంకా సాధించలేదని స్పష్టం చేస్తున్నారు.

CSK అభిమానులకు మరో ఎదురుదెబ్బ..ధోని రావ‌డం ఇక‌ క‌ష్ట‌మే!
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐపీఎల్ 2026 ప్రారంభం కాక ముందు నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్లేయర్లు గాయాల బారిన పడి వైదొలిగారు. ఇక మహేంద్ర సింగ్ ధోని అయితే ఎప్పుడు ఆడతాడో ? తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ధోని ఆడతాడని మూడు రోజుల నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ధోని అభిమానులకు చేదు వార్త ఎదురైంది. ఇవాళ ముంబైతో జరిగే మ్యాచ్ కు ధోని దూరం కాబోతున్నట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

గాయం నుంచి కోలుకున్నప్పటికీ... మహేంద్ర సింగ్ ధోని ఫిట్ నెస్ ఇంకా సాధించలేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కు కూడా ధోని దూరం అవుతున్నాడట. అయితే ఏప్రిల్ 26వ తేదీన గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ కు మాత్రం మహేంద్రసింగ్ ధోని అందుబాటులో ఉంటాడని చర్చ జరుగుతోంది. అదే సమయంలో ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడడం కూడా ఇవాళ డౌట్ అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి తల్లి మరణించారు. దీంతో ముఖేష్ చౌదరి హుటా హుటిన తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగే మ్యాచ్ కు ముఖేష్ అందుబాటులో ఉండటం లేదట‌.

Chennai Super Kings : చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టులో పెను విషాదం

Next Story